Woman dies in temple premises in AP: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ కుటుంబమంతా.. ఊరు కాని ఊరు వచ్చారు. ఎంతో సంతోషంగా గడిపారు. కానీ అనుకోని విపత్తు ఆ కుటుంబంలో జరిగింది. ఏం చేయాలో దిక్కుతోని స్థితిలో ఉన్నారు. ఎవరు సాయం చేస్తారో తెలియని పరిస్థితి.. ఇలాంటి సమయంలోనే ఓ తహసీల్దార్ మానవత్వం చాటుకున్నాడు. అందరిచేత మన్ననలు అందుకున్నాడు.
కర్నూలు జిల్లా బేతంచర్ల నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలోని పొలతల మల్లేశ్వర స్వామి ఆలయానికి ఆ కుటుంబం వచ్చింది. అప్పటివరకు ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా ఆ కుటుంబంలోని మహిళ దేవాలయ సమీపంలో మృతి చెందారు. ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో.. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఉదయ భాస్కర్ వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అంబులెన్స్ రప్పించడంతో పాటు ఆ మహిళ మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి ఆర్థిక సహాయం చేశారు.
వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పొలతల మల్లేశ్వర స్వామి శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన మహిళ మృతి చెందారు. కుటుంబసభ్యులు మృతురాలిని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. ఆలయ సిబ్బంది, ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు.. తన సొంత ఖర్చులతో అంబులెన్స్‌ను పిలిపించారు.