కడప నగరంలోని ఉక్కాయపల్లి ప్రాంతానికి చెందిన సుధారాణి, శ్రీకాంత్‌లు వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై కడపకు వచ్చారు. పనులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా.. వై-కూడలి వద్ద డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో సుధారాణి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం శ్రీకాంత్‌ను కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. మహిళ మృతి - kadapa crime news
కడప నగరంలోని వై-కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు.

కడపలో రోడ్డు ప్రమాదం