కడప జిల్లా బి.కోడూరు మండలం మున్నెల్లిలో విషాద ఘటన జరిగింది. కార్తిక దీపాలను వెలిగించేందుకు సగిలేరు నదిలోకి దిగిన మహిళ.. ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. సమీప గ్రామం బోడిగుండు పల్లి వద్ద చెరువు పక్కన మృతదేహం లభ్యమయ్యింది. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు మున్నెల్లి గ్రామానికి చెందిన నారమ్మగా స్థానికులు గుర్తించారు. వడ్డమాను చిదానందం దిగువ సగిలేరు జలాశయం నుంచి నదిలోకి నీటిని అధికారులు వదిలారు. నదిలోకి దిగవద్దని ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
నది ప్రవాహంలో కొట్టుకుపోయిన మహిళ మృతి - కడప జిల్లాలో ఈరోజు తాజా వార్తలు
కార్తిక దీపాలు వెలిగించేందుకు నదిలో దిగిన మహిళ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సంఘటన కడప జిల్లా మున్నెల్లిలో చోటు చేసుకుంది. వడ్డమాను చిదానందం దిగువ సగిలేరు జలాశయం నుంచి నీటిని వదిలారు. దీంతో నదిలో నీటి ప్రవాహం పెరిగింది. కార్తికదీపాలు నదిలో వదిలేందుకు వచ్చిన మహిళ ప్రమాదవశాత్తులో ప్రవాహంలో కొట్టుకుపోయారు.
కార్తిక దీపాలు వెలిగించేందుకు నదిలోకి దిగన మహిళ మృతి