కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పెద్దకుడాల గ్రామంలో మహిళ దారుణహత్యకు గురైంది. పెద్దకుడాలకు చెందిన నాగమ్మ(45) భర్త వదిలేయడంతో తల్లితో కలిసి జీవిస్తోంది. ఆమె ఒంటిపై, ముఖంపై బండరాళ్లతో కొట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, హత్యాచారం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హంతకులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
పెద్దకుడాల గ్రామంలో మహిళ దారుణ హత్య - కడప జిల్లాలో మహిళ దారుణ హత్య
పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పెద్దకుడాల గ్రామ శివారులో మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటిపై గాయాలు ఉండటంతో.. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

పెద్దకుడాల గ్రామంలో మహిళ దారుణ హత్య
Last Updated : Dec 10, 2020, 5:46 AM IST