కడప జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకున్నప్పటికీ... పరిమిత సంఖ్యలోనే మద్యం అందుబాటులో ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. లాక్డౌన్ కారణంగా నెలరోజుల క్రితం మద్యం దుకాణాలు మూసివేశారు. ప్రస్తుతం జిల్లా ఎక్సైజ్ గోడౌన్లో కేవలం 20 వేల మద్యం కేసులు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి జిల్లాలోని మద్యం దుకాణాలకు మూడు రోజులకు కూడా సరిపోవని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. కడప మద్యం గోడౌన్ నుంచి మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!
'మూడు రోజులకే మద్యం అయిపోతుంది'
లాక్డౌన్ నిబంధనల సడలింపులతో మద్యం దుకాణాలు తెరుచుకున్నప్పటికీ కడప జిల్లాలో పరిమిత సంఖ్యలోనే మద్యం అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఎక్సైజ్ గోడౌన్లో 20 వేల మద్యం కేసులు మాత్రమే నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
కడప జిల్లాలో పరిమిత సంఖ్యలో మద్యం నిల్వ