జమ్మలమడుగు, పులివెందుల, మైదకూరు తదితర నియోజకవర్గాల పరిధిలో శనివారం రాత్రి కురిసిన గాలివాన.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జమ్మలమడుగు మండలం కొట్టాలపల్లి గ్రామంలో 3 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లకు పై కప్పులు ఎగిరిపోయాయి. గండికోట ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిమ్మ చెట్లు పడిపోయాయి.
గాలివాన బీభత్సం.. రైతులకు తీవ్ర నష్టం - కడప జిల్లా రైతలు సమాచారం
కడప జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని రైతులకు పంట నష్టం వాటిల్లింది. జమ్మలమడుగు మండలంలో 3 ఇళ్లు కూలిపోయాయి.
![గాలివాన బీభత్సం.. రైతులకు తీవ్ర నష్టం wind and rainfall damages highly in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6945965-485-6945965-1587888505080.jpg)
గాలివానకు కుప్పకూలిన ఇల్లు