ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కర్​ మూతతో భర్తను హత్య చేసిన భార్య - cooker lid crime in kadapa news

మద్యం తాగి తరచూ గొడవ పడుతున్న భర్తను అతని భార్య కుక్కర్​ మూతతో కొట్టి హతమార్చిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కర్​ మూతతో భర్తను హత్య చేసిన భార్య
కుక్కర్​ మూతతో భర్తను హత్య చేసిన భార్య

By

Published : May 28, 2020, 10:04 AM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో నాగేశ్వరరావు అనే వ్యక్తిని అతని భార్య కుక్కర్​ మూతతో తలపై కొట్టి హతమార్చింది. నాగేశ్వరరావు తరచూ మద్యం తాగి గొడవపడేవాడు.

రాత్రి మద్యం తాగి వచ్చి మళ్లీ ఘర్షణకు దిగాడు. సహనం కోల్పోయిన భార్య అతని తలపై కొట్టి చంపేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ‌ప‌రీక్షల కోసం మృత‌దేహాన్ని ప్రభుత్వాస్పత్రికి త‌ర‌లించారు.

ABOUT THE AUTHOR

...view details