ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కడప జిల్లా పులివెందుల ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

kadapa district
భార్య పై అనుమానంతో.. భర్త ఆత్మహత్య

By

Published : May 18, 2020, 2:18 PM IST

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం లోపట్నుతల గ్రామానికి చెందిన ముద్ధం వెంకట ప్రతాప్ (31) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 8 సంవత్సరాల కిందట స్రవంతి అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకట ప్రతాప్ యుసీఐఎల్ లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. భార్య స్రవంతి గ్రామ వాలంటరీగా పని చేస్తుంది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. కొద్ది రోజులుగా భార్య ప్రవర్తనపై వెంకట ప్రతాప్ అనుమానం పెంచుకోవడంతో గొడవలు జరుగుతున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పులివెందుల అర్బన్ పీఎస్ ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details