న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన - భర్త ఇంటి ముందే ఆందోళన దిగిన భార్య న్యూస్
కడప జిల్లా బద్వేల్‌లో భర్త ఇంటి ముందే న్యాయం కావాలంటూ భార్య ఆందోళనకు దిగింది. నూర్ బాషా కాలనీలో ఉంటున్న శ్రీనివాసులు భార్య చంద్రకళ.... బిడ్డతో పాటు ఆందోళన చేసింది. చివరకు అత్తమామలు కూడా లోనికి రానివ్వకుండా తలుపులు వేసేశారు. దీంతో తన కాపురం తనకు కావాలంటూ నిలదీసింది. ఆస్తి కోసం తనను వదిలించుకుని తన భర్తకు వేరే వివాహం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
wife-strike-at-husbands-house
.