కడప జిల్లా రాయచోటిలో దారుణ హత్య జరిగింది. కొత్తపేట ఎన్జీవో కాలనీ సమీపంలో ఉంటున్న షేక్ ఖాదర్‌వలీ... తన భార్య నూర్జహాన్‌ను రోకలి బండతో బాది ... కొడవలితో దారుణంగా నరికి హత్యచేశాడు. అడ్డొచ్చిన కుమారుడు రఫీని సైతం హతమార్చే ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోగా... స్వల్ప గాయాలతో రఫీ ఇంటి నుంచి బయటపడ్డాడు. హత్యకు పాల్పడిన ఖాదర్‌వలీని ఇంట్లోనే ఉంచి స్థానికులు గడియపెట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.
రాయచోటిలో దారుణం... భర్త చేతిలో భార్య దారుణ హత్య - కడప జిల్లాలో భర్త చేతిలో భార్య హత్య
కడప జిల్లా రాయచోటిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో భార్య నూర్జహాన్‌ను.. భర్త షేక్ ఖాదర్ వలీ దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన కుమారుడు రఫీని హతమార్చే ప్రయత్నం చేశాడు.
రాయచోటిలో దారుణం... భర్త చేతిలో భార్య దారుణ హత్య