కడప జిల్లా రైల్వేకోడూరులో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పర్యటించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డితో కలిసి శాంతినగర్, రంగనాయకులపేట వీధులను పరిశీలించారు. స్థానిక పంచాయతీ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య పనులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో క్రిమిసంహారక మందులను పిచికారి చేయాలని సూచించారు.
రైల్వేకోడూరులో పర్యటించిన విప్ శ్రీనివాసులు - Whip Srinivas traveled on the railway
కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడితో కలిసి ఆయన పట్టణంలో పర్యటించారు.

రైల్వేకోడూరులో పర్యటించిన విప్ శ్రీనివాసులు