కడపలో దారుణం జరిగింది. డబ్బు అడిగితే ఇవ్వలేదనే కోపంతో... అక్కపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకెలితే... పట్ణణానికి చెందిన సులోచన హైదరాబాద్లో న్యాయవాదిగా వృత్తిని కొనసాగిస్తోంది. రెండురోజుల కిందట ఆమె పట్టణానికి రాగా... ఆమె తమ్ముడు డబ్బు విషయమై వేధించడం మెుదలుపెట్టాడు. తనవద్ద లేవని బాధితురాలు చెప్పటంతో... విచక్షణ కోల్పోయిన నిందితుడు చేతులు, వీపుపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అతడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగదు అడిగితే ఇవ్వలేదని... అక్కపై కత్తితో దాడి చేసిన తమ్ముడు - అక్కపై తమ్ముడి దాడి
మానవసంబధాలు రోజురోజుకూ మంటకలిసిపోతున్నాయి. డబ్బుకిచ్చే విలువ... రక్త సంబంధాలకు ఇవ్వలేకపోతున్నారు. దీనికి ఉదాహరణ కడపలో జరిగిన ఘటనే. డబ్బు అడిగితే ఇవ్వలేదని తోబుట్టువని కూడా చూడకుండా కత్తితో పాశవికంగా దాడి చేశాడో తమ్ముడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
అక్కపై తమ్ముడు కత్తితో దాడి