ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యురేనియం కర్మాగారాన్ని పరిశీలించిన అధ్యయన కమిటీ - యురేనియం

కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం అనర్థాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ యూసీఐఎల్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజంతా యురేనియం కర్మాగారం పనితీరుపై కమిటీ పరిశీలించింది. వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీ ప్రశ్నలకు యూసీఐఎల్​ అధికారుల సమాధానాలు దాటవేత ధోరణిలో సాగినట్లు తెలిస్తోంది.

యురేనియం

By

Published : Sep 10, 2019, 4:19 AM IST

యూసీఐఎల్ అధికారులపై నిపుణుల కమిటీ ప్రశ్నల వర్షం

యురేనియం కర్మాగారం అనర్థాలపై ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ... కడప జిల్లా తుమ్మలపల్లిలో పర్యటించింది. సోమవారం కర్మాగారాన్ని సందర్శించిన 11 మంది సభ్యుల కమిటీ ఉదయం 2 గంటల పాటు యూసీఐఎల్​ అధికారులతో సమావేశమైంది. 2007 నుంచి ఇప్పటివరకూ ప్లాంట్ పురోగతి సాధించిన విధానాన్ని కమిటీకి యూసీఐఎల్​ అధికారులు వివరించారు. సంతృప్తి చెందని కమిటీ సభ్యులు ప్రజల ఫిర్యాదులను చూపుతూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పర్యావరణ రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. టెయిల్ పాండ్‌తో భూగర్భజలాలు కలుషితం అవుతుండటంపై ప్రజల ఫిర్యాదులను గుర్తుచేశారు. టెయిల్‌పాండ్‌ కిందిభాగంలో "బెంటనైట్ క్లే" లాంటి పదార్థంతో కాంక్రీట్ వేసేందుకు ప్రతిపాదనలు చేశారా అని అడిగారు. 2008 నుంచి 2015 వరకు ఏటా నీటిలో యురేనియం శాతం పెరిగిందని 2017లో తగ్గినట్లే తగ్గి 2018లో మళ్లీ ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.

చర్యలు ఏవి?

మధ్యాహ్నం మరోసారి ప్లాంటును పరిశీలించిన కమిటీ చుట్టు పక్కల గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని యూసీఐఎల్​ అధికారులను ప్రశ్నించింది. పొరుగు గ్రామాల్లో పంటలు దెబ్బతినడంపైనా ఆరా తీసింది. కర్మాగారంలో ముడి యురేనియం వెలికితీత, శుద్ధి ప్రక్రియను సభ్యులు పరిశీలించారు. ఈ విధానంలో ఎలాంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రేపు ప్రభుత్వానికి నివేదిక

కమిటీ సభ్యులు టెయిల్‌పాండ్‌ను పరిశీలిస్తున్న సమయంలో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా సీపీఎం, సీపీఐ నాయకులు రావటంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. నాణ్యతాప్రమాణాలు పాటించకుండా నిర్మించిన టెయిల్‌పాండ్‌తో తాగు, సాగునీరు కలుషితమవుతున్నాయని వారు మండిపడ్డారు. యురేనియం ప్రాజెక్టు పరిసరాల్లోని 7 గ్రామాల్లో కమిటీ ఇవాళ పర్యటించనుంది. వాస్తవ పరిస్థితిపై అధ్యయనం చేయనుంది. సమగ్ర పరిశీలన అనంతరం రేపు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

ఇవీ చదవండి
ఊరు ఊపిరికి..'ఉరే'నియం
యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details