ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కుల డిమాండ్​ను మనీ చేసుకుంటున్నవారిపై కొరడా - weighing scales checks news update

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు తూనిక‌లు కొల‌త అధికారి శంక‌ర్ త‌నిఖీలు నిర్వ‌హించారు. క‌రోనా నేప‌థ్యంలో మాస్కుల డిమాండ్​ను కొంద‌రు దుకాణాదారులు ఆసరా‌ాగా చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని పలు దుకాణదారులపై కేసులు నమోదు చేశారు.

weighing scales officer checks
తూనికలు కొలతల అధికారులు తనిఖీలు

By

Published : May 15, 2020, 5:32 PM IST


క‌రోనా నేప‌థ్యంలో మాస్కుల డిమాండ్​ను కొంద‌రు దుకాణాదారులు ఆస‌రాగా చేసుకుంటున్నారు. మాస్కులను ఇష్ట‌మొచ్చిన ధ‌ర‌ల‌కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావ‌డంతో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు తూనిక‌లు కొల‌త అధికారి శంక‌ర్ త‌నిఖీలు నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని వాస‌రి ఫార్మా కాంప్లెక్స్‌లోని శ్రీ సాయి స‌ప్త‌గిరి ఫార్మాస్యూటిక‌ల్ దుకాణంలో 70 రూపాయ‌ల విలువైన ఎన్‌-95 మాస్కు 362 రూపాయ‌లు విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించి కేసు న‌మోదు చేశారు. అలాగే వినాయ‌క మెడికల్ ఏజెన్సీస్‌లో పైన క‌న్య్సూమ‌ర్ కేర్ లేనందున మ‌రో కేసు న‌మోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details