ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దుకాణాల్లో తూకాలకు సీల్​ లేకుంటే భారీగా జరిమానాలు' - తూనికలు కొలతల అధికారుల దాడులు

కడపలోని దుకాణాల్లో తూనికలు కొలతల అధికారి శంకర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి తూనికలకు సీల్​ లేని దుకాణాలకు జరిమానాలు విధించారు. దుకాణదారులు తక్షణమే సీల్ వేయించుకోవాలని.. లేదంటే భారీగా జరిమానాలు కేసులు ఉంటాయని ఆయన అన్నారు.

weight and measurement department officer raids
తూనికలు కొలతల అధికారి దాడులు

By

Published : Dec 23, 2020, 10:41 PM IST

జిల్లాలోని దుకాణాదారులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని కడప జిల్లా తూనికలు కొలతల అధికారి శంకర్ హెచ్చరించారు. జిల్లాలో నిబంధనలు అతిక్రమించిన దుకాణాలపై సిబ్బందితో కలిసి ముమ్మర దాడులు చేశారు. ఐదు దుకాణాల్లో తూకాలకు సీల్ లేకపోవడంతో ఒక్కో దుకాణానికి ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.

సింహాద్రిపురంలోని ఎరువుల దుకాణంలో 30 కేజీలు ఉండాల్సిన ఎరువులు 28 కేజీలకు ఉండడంతో కేసు నమోదు చేయడంతో పాటు రూపాయలు పది వేలు జరిమానా విధించారు. ఓ మిఠాయి దుకాణంలో సీల్ వేసే యంత్రానికి అనుమతి లేకపోవడంతో పది వేల రూపాయల జరిమానా విధించి.. కేసు నమోదు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని చాలా దుకాణాల్లో తూకాలకు సీల్​లు లేవని.. దుకాణదారులు తక్షణమే సీల్ వేయించుకోవాలని ఆయన సూచించారు. లేదంటే భారీ స్థాయిలో జరిమానాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: న్యాయం చేయమంటే... లంచం అడుగుతున్నారయ్యా!

ABOUT THE AUTHOR

...view details