ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చేనేత కార్మికుల ఆందోళన.. 'అర్హులకు నేతన్న నేస్తం రాదా?'

By

Published : Jun 2, 2020, 10:32 AM IST

తరతరాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటే నేతన్న నేస్తం పథకంలో ఎందుకు అర్హత కల్పించరని చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు.

kadapa district
'అర్హులకు నేతన్న నేస్తం రాదా?'

కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మోరగుడి గ్రామానికి చెందిన చేనేత కార్మికులు నిరసన తెలియజేశారు. నేతన్న నేస్తం పథకం వర్తింపజేయాలంటూ కడప చేనేత జౌళి శాఖ కార్యాలయానికి దరఖాస్తులు పంపించామని చెప్పారు . జిల్లా అధికారులు అర్హులుగా గుర్తించి దరఖాస్తులను గ్రామ సచివాలయానికి పంపిస్తే.. వాలంటీర్లు, గ్రామ సంక్షేమ అధికారులు తిరస్కరిస్తున్నారని వాపోయారు.

నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం వర్తించదా అని ప్రశ్నించారు . అనర్హులు చాలామంది నేతన్న నేస్తం కింద లబ్ధి పొందారని ఆరోపించారు. ఇప్పటికైనా నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.


ఇది చదవండిమత్తు కోసం శానిటైజర్​ తాగిన తల్లి కొడుకు

ABOUT THE AUTHOR

...view details