కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని సచివాలయం వద్ద చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. చేనేత కార్మికుల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులకు కాకుండా అనర్హులకు లబ్ధి చేకూర్చారని బాధితులు ఆందోళన చేపట్టారు. చేనేత కార్మికులు సచివాలయానికి వచ్చి చూడగా అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో... ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. హోటల్లో పనిచేసే వారు, ఫొటో స్టూడియో పెట్టుకున్న వారు, దుకాణాల్లో పనిచేసే వారి పేర్లు జాబితాలో వచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం మగ్గం నేసే సమయంలో అధికారులు వచ్చి స్వయంగా చూశారు.. అయినా మా పేర్లు అర్హుల జాబితాలో ఎందుకు రాలేదని బాధితులు మండిపడ్డారు.
'మా పేర్లు అర్హుల జాబితాలో ఎందుకు లేవు' - etv bharat latest updates
కడపజిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని సచివాలయం వద్ద చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. చేనేత కార్మికుల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులకు కాకుండా అనర్హులకు లబ్ధి చేకూర్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
'మా పేర్లు అర్హుల జాబితాలో ఎందుకు రాలేదు'