ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కమిషనర్​​ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు' - హైకోర్టు తీర్పుపై ఆదిమూలపు సురేశ్ స్పందన

నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను తిరిగి ఎన్నికల ప్రధానాధికారిగా నియమించాలన్న హైకోర్టు తీర్పును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు ఖండించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.

'We will go to Supreme Court on High Court verdict' said educational minister adimoolapu suresh
హైకోర్టు తీర్పును విద్యాశాఖ మంత్రి స్పందన

By

Published : May 30, 2020, 8:35 AM IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే... రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు చేసిందన్న ఆయన.... ప్రభుత్వ వాదనను ఎవరూ పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్​పై ఆరోపణలు వచ్చినందున ఆర్డినెన్స్ ద్వారా సీఎం.. కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించారని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్ వెనక్కి తగ్గే ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు.

'హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఏడాది కాలంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల్లో భాగంగానే న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తిని నూతన ఎన్నికల కమిషనర్​గా నియమించాం' - ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖమంత్రి

ఇదీ చదవండి:

హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చా: నిమ్మగడ్డ

ABOUT THE AUTHOR

...view details