లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే వైకాపా ఎన్నికలకు దూరంగా ఉందని భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు కడపలో ఎద్దేవా చేశారు. 18 నెలల కాలంలోనే అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు.
అవ లక్షణాలు ఏపీలో తిష్ట వేశాయి..
ఇసుక మాఫియా, లిక్కర్, ఎర్రచందనం, భూ దందా, జూదం వంటి అవలక్షణాలు ఏపీలో రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల తరహాలోనే రానున్న తిరుపతి ఎన్నికల్లో కూడా భాజపా గెలువబోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ చేతులెత్తేశారు..