కడప కలెక్టరేట్లో 18 లక్షల 50 వేల రూపాయలతో ఇంకుడు గుంతల నిర్మాణానికి కలెక్టర్ హరికిరణ్ శంకుస్థాపన చేశారు.జిల్లా మినరల్ ఫండ్ నిధులతో కలెక్టరేట్ భవనాలపై పడే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసే విధంగా ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 5 ఇంకుడు గుంతల నిర్మాణాల ద్వారా ఏడాదికి 4728 క్యూబిక్ మీటర్ల నీటిని రీచార్జ్ చేసి భూమిలోకి పంపవచ్చని అధికారులు వివరించారు. ఏడాదికి 91 లక్షల లీటర్ల నీటిని ఇంకింప జేయవచ్చని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. అనంతరం జిల్లాలోని 13 మండలాల్లో అమలవుతున్న జలశక్తి అభియాన్ పథకం తీరు తెన్నులను కేంద్ర నోడల్ అధికారి సురేశ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం పక్కాగా అమలు చేయడానికి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. భూమి మీద పడే వర్షపు నీటిని ఒడిసి పట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కడప కలెక్టరేట్లో ఇంకుడు గుంతలు
కడప కలెక్టరేట్లో ఇంకుడుగుంతల నిర్మాణానికి శుంకస్థాపన చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్లాలని జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ అధికారి సురేశ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఇంకుడు గుంతలకుశంకుస్థాపన చేస్తున్న కలెక్టర్