ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరం నుంచి పెన్నాకు నీరు విడుదల - మైలవరం నుంచి పెన్నాకి నీటి విడుదల తాజా వార్తలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు... మైలవరం జలాశయం కళకళలాడుతోంది. దీంతో పెన్నా నదికి నీటిని విడుదల చేశారు.

Mylavaram reservoir water release to penna river

By

Published : Oct 24, 2019, 11:07 AM IST

కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 2500 క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి వదిలారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువ ఉంది. ఫలితంగా రిజర్వాయర్ నుంచి పెన్నాకు 5 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నది పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఎగువ నుంచి నీటి విడుదల ఎక్కువయితే మరో 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. చేపల వేటకు వెళ్ళేవారు... పెన్నా పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 11.9 టీఎంసీల నీరు ఉండగా, మైలవరం జలాశయంలో 6 టీఎంసీలకు పైగా నీరు ఉంది.

మైలవరం నుంచి పెన్నాకి నీటి విడుదల

ఇదీచూడండి.నిరంతర ప్రవాహం... నిండుకుండల్లా జలాశయాలు

ABOUT THE AUTHOR

...view details