అన్నమయ్య జలాశయం నుంచి సాగునీరు విడుదల - రాజంపేటలో అన్నమయ్య జలాశయం నుంచి నీరు విడుదల
కడప జిల్లా రాజంపేటలోని అన్నమయ్య జలాశయం నుంచి అధికారులు నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి నీటిని వదిలారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలువల ద్వారా వచ్చే నీటిని చెరువుల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భజలాలు పెరుగుతాయని.. తద్వారా సాగునీటి కష్టాలు ఉండవని వివరించారు.
అన్నమయ్య జలాశయం
.