ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధి నిర్వహణలో ఉన్న వీఆర్​ఏ గుండెపోటుతో మృతి - గడికోట శ్రీకాంత్ రెడ్డి

విధి నిర్వహణలో ఉన్న వీఆర్​ఏ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కడప జిల్లా రాయచోటిలో జరిగింది. కొవిడ్​ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వీఆర్​ఏగా విధుల్లో ఉన్న కృష్ణయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన మరణంతో తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

vra died of heart attack
vra died of heart attack

By

Published : Aug 12, 2020, 4:10 PM IST

విధి నిర్వహణలో ఉన్న వీఆర్​ఏ ఆక్మసికంగా మృతి చెందారు. కడప జిల్లా రాయచోటిలో కొవిడ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న వీఆర్​ఏ కృష్ణయ్య (55) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన రెవెన్యూ, పురపాలిక సిబ్బంది సపర్యలు చేసిన వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పటివరకు తమతో పాటే కలిసి పనిచేసిన వీఆర్​ఏ... ప్రాణాలు వదలటంపై తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి హామీఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details