ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేట పురపాలకలో మహిళా ఓటర్లే అధికం - list

రాజంపేట పురపాలక ఓటర్లలో మహిళలే అత్యధికంగా ఉన్నారని పురపాలక కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు.

జాబితాను చూపిస్తున్న హరిబాబు

By

Published : May 11, 2019, 6:10 AM IST

వివరాలు వెల్లడిస్తుతన్న పురపాలక కమిషనర్
కడప జిల్లా రాజంపేట పురపాలక ఓటర్ల జాబితాను కమిషనర్ శ్రీ హరిబాబు శుక్రవారం విడుదల చేశారు. నగరంలోని 20 వార్డులకు సంబంధించి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో 20 వార్డులుండగా 31,668 ఓట్లర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో పురుషుల ఓట్లు 15,382, స్త్రీలు 16,278 ఉన్నట్లు వెల్లడించారు. ఈ జాబితాకు సంబంధించిన సమాచారాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం, తహసీల్దార్, మండల పరిషత్, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రధాన పార్టీల నాయకులకు ఉచితంగా ఓటరు జాబితాను అందజేశామన్నారు. ప్రజలు జాబితాను పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details