కడప జిల్లా రాయచోటి పురపాలికలు వార్డు వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమన్ని ప్రారంభించారు. పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిక్షణకు పురపాలికలో 1 నుంచి 16 వార్డుల వరకు ఎంపికైనా 220 మంది వాలంటీర్లు హాజరయ్యారు.ప్రభుత్వ పథకాలు, వాటి నిర్వహణ, అర్హులను ఎంపిక చేసే విధానంపై అవగాహన కల్పించారు. అర్హులైన లబ్ధిదారులకు సరుకుల పంపిణీలో జాగ్రత్తలు తీసుకుని, అవకతవకలకు చోటు లేకుండా సకాలంలో చేరవేయాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు.
రాయచోటిలో వార్డు వాలంటీర్లుకు శిక్షణ - వాలంటీర్లు
కడప జిల్లా రాయచోటిలో వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు వాటి నిర్వహణ అర్హులను ఎంపిక చేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు
శిక్షణ తీసుకుంటున్న వాలంటీర్లు