జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలకు కడప జిల్లా రాజంపేట క్రీడా మైదానం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి 31 వరకు 46వ జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలను రాజంపేటలోని ప్రైవేటు పాఠశాలలో నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని వసతులను సమకూర్చారు. ఈ ఏర్పాట్లను వాలీబాల్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు, ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీత రమణరావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 2005 లోనే జాతీయ పోటీలను అట్టహాసంగా నిర్మించామని మరోసారి నిర్వహణకు రాజంపేట వేదిక అయ్యిందన్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను ప్రజలు తిలకించి... క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలకు రాజంపేట ముస్తాబు - rajampeta latest news
దేశంలోని వాలీబాల్ క్రీడాకారులకు కడప జిల్లా రాజంపేట వేదిక కానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి.

జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలకు ముస్తాబవుతున్న రాజంపేట
జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలకు ముస్తాబవుతున్న రాజంపేట
ఇదీ చదవండి :