12 రోజుల రిమాండ్
వైఎస్ వివేకా హత్య కేసు.. మరో ముగ్గురి అరెస్టు! - 3 people arrest
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు మరో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. పులివెందుల న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు.
వివేకా మృతి అనంతరం నిందితులు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 15న ఉదయం స్నానాల గదిలో ఉన్న వివేకా మృతదేహాన్ని పడకగదికి తరలించినట్టు గుర్తించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు భావించారు. ఉదయం లేఖ దొరికినా.. సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. నిందితులుఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు.