Vivekananda Reddy murder case updates: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సమయంలో ఆయన (వివేకానంద రెడ్డి) రాసిన లేఖకు నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష జరిపేందుకు అనుమతివ్వాలని గతకొన్ని నెలల క్రితం నాంపల్లి సీబీఐ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఈ నెల 7వ తేదీన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనుంది. సీబీఐ వేసిన పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిశాయి. తన (వివేకా) హత్యకు డ్రైవర్ ప్రసాద్ కారణమంటూ.. వివేకా రాసిన లేఖ ఆరోజున హత్యస్థలిలో లభించింది. దీంతో ఆ లేఖను పరీక్షించిన సీఎఫ్‌ఎస్‌ఎల్ దిల్లీ విభాగం.. తీవ్రమైన ఒత్తిడిలో వివేకానంద రెడ్డి ఆ లేఖను రాసినట్టు తేల్చింది. నిందితులు బలవంతంగా వివేకాతో ఆ లేఖ రాయించినట్లు దర్యాప్తులో సీబీఐ గుర్తించింది. అయితే, ఆ లేఖపై వివేకాతో పాటు ఇంకా ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో.. గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్ పరీక్ష జరపాలని సీబీఐ భావించింది.
వివేకా లేఖపై ఈనెల 7న తీర్పు..మరోపక్క ఆ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంకు దెబ్బతినే ప్రమాదం ఉందని సీఎఫ్‌ఎఫ్‌ఎల్ చెప్పడంతో.. నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్షకు అనుమతివ్వాలని కోర్టును సీబీఐ కోరింది. ఒరిజినల్ లేఖ స్థానంలో కలర్ జిరాక్సును రికార్డులో పెట్టాలని కోరింది. ఈ క్రమంలో సీబీఐ అభ్యర్థనపై నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఈనెల 7న తీర్పును వెల్లడిస్తామని విచారణలో పేర్కొంది. తాజాగా వివేకా హత్య కేసు విచారణ ప్రక్రియలో సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తన న్యాయవాదులు కూడా సహకరించేలా అనుమతివ్వాలన్న సునీత పిటిషన్‌పై వాదనలు.. ఈనెల 8వ తేదీకి వాయిదా పడ్డాయి.
YS Viveka Murder Case: వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్