ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIVEKA MURDER CASE: నేడూ ఆయుధాల కోసం సీబీఐ అన్వేషణ..

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం సీబీఐ ముమ్మరంగా గాలిస్తోంది. కీలక నిందితుడు సునీల్‌ ఇచ్చిన సమాచారంతో పులివెందుల రోటరీపురం వంకలో రెండ్రోజులుగా ఆయుధాల కోసం గాలించిన సీబీఐ.. ఈ రోజూ అన్వేషణ కొనసాగిస్తోంది.

VIVEKA MURDER CASE
VIVEKA MURDER CASE

By

Published : Aug 9, 2021, 5:52 AM IST

Updated : Aug 9, 2021, 11:38 AM IST

వైఎస్ వివేకా హత్య (Viveka murder case)కేసును ఛేదించేందుకు సీబీఐ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వివేకా హత్యకు (Viveka murder case) ఉపయోగించిన ఆయుధాల కోసం మూడోరోజు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇవాళ రెండు ప్రాంతాల్లో ఆయుధాల కోసం తనిఖీలు చేస్తున్నారు. రోటరీపురంతో పాటు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గుర్రాల గడ్డ వంకలో కూడా సీబీఐ (cbi) అధికారులు వెతుకుతున్నారు. రెండు ప్రాంతాల్లో మట్టిని తవ్వి తీస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా మట్టిని వేరుచేసి మారణాయుధాలు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సునీల్‌ యాదవ్‌ ఇచ్చిన సమాచారంతో..

కీలక నిందితుడు సునీల్‌ యాదవ్‌ ఇచ్చిన సమాచారంతో.. హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం పులివెందుల రోటరీపురం వంకలో రెండ్రోజులుగా అన్వేషించినా దొరకలేదు. శనివారం 7 గంటలు, ఆదివారం 12 గంటల పాటు పారిశుద్ధ్య సిబ్బంది బురదలో అణువణువూ గాలించారు. తర్వాత పొక్లెయిన్ తెప్పించిన అధికారులు.. సునీల్ సూచించిన ప్రదేశంలో మట్టిని తవ్వించారు. 2019 మార్చి 15న వివేకాను హత్యచేసిన (Viveka murder case) దుండగులు పారిపోతూ ఈ వంకలో ఆయుధాలు పడేసినట్లు సునీల్ యాదవ్ చెబుతున్నారు. రెండేళ్ల కిందట ఆయుధాలు పడేసిన ప్రదేశంలో ఉంటాయా..లేక వరదకు కొట్టుకుని పోయాయా అనేది తేలాల్సి ఉంది. కానీ సీబీఐ మాత్రం సునీల్ చెప్పిన ప్రదేశంలో ఈ రోజూ అన్వేషిస్తోంది. ఆ ప్రాంతంలో స్థానికులు తిరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు చర్యలు చేపట్టారు.

సీబీఐను కలిసిన వివేకా కుమార్తె..

ఆదివారం ఆయుధాల అన్వేషణ ముగిసిన తర్వాత సునీల్ యాదవ్‌ను తీసుకుని సీబీఐ(cbi) అధికారులు కడపకు వెళ్లారు. కాగా మరో బృందం పులివెందుల ఆర్అండ్ బీ అతిథి గృహంలో బస చేసింది. ఈ సమయంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు దర్యాప్తు తీరు..సునీల్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వీరు తెలుసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

Last Updated : Aug 9, 2021, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details