మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేకపోయినా సీబీఐ అధికారులు కావాలనే ఇరికించారని సునీల్ యాదవ్ తల్లి సావిత్రి, భార్య లక్ష్మి ఆరోపించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్‌ను చూసేందుకు ఇవాళ వారు జైలు వద్దకు వచ్చారు. సునీల్‌ను కలిసేందుకు జైలు అధికారులు వారిని అనుమతించలేదు.
కావాలనే ఇరికించారు
రెండేళ్ల నుంచి పోలీసులు, సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని చిత్ర హింసలు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్‌ను సీబీఐ అధికారులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపించారు. హత్య కేసు ఒప్పుకోవాలని సునీల్ స్నేహితుడు ఒత్తిడి చేయటంతో గత్యంతరం లేక గోవా పారిపోయాడన్నారు. వైఎస్ కుటుంబం అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని.. కొందరు వ్యక్తులు కావాలనే తమ కుమారుడిని ఇరికిస్తున్నారని సావిత్రి వాపోయారు. దస్తగిరి, ఉమా శంకర్ ద్వారానే సునీల్‌కు వివేకానందరెడ్డి పరిచయం అయ్యారు కానీ.. హత్య కేసుతో సంబంధం లేదన్నారు. వివేకాను హత్య చేసిందెవరో సీబీఐకి తెలుసునని సునీల్ భార్య లక్ష్మీ ఆరోపించారు.
గోవాలో అరెస్టు