Viveka Murder Case Latest Update: చాలా నెలల తర్వాత మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేక హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐఎస్పీ రామ్ సింగ్‌తో పాటు వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాలతో వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ముగ్గురుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సంచలనం కలిగించింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులోకొత్త మలుపు: వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy) ఆయన పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ పైన సైతం పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద ఈనెల 15న కేసు నమోదు చేశారు.
కడప ఎస్పీని కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి
పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పైన ఐపీసీ 156, 352, 323, 330, 342, 348, 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 2021 ఫిబ్రవరిలో వివేక పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. ఆరుగురు నిందితులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్, బీటెక్ రవితో పాటు మరో ముగ్గురుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు.