వివేకా హత్య.. నిందితులకు మరో 14 రోజుల రిమాండు - వివేకా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 వరకు నిందితులకు రిమాండు విధించారు.

వివేకా హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండు
మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్ లను ఈనెల 4న పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలతో నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. వారిని పులివెందుల కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నేరాంగీకార పత్రాన్ని కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే నిందితులకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండు విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.