ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తమకు సాయుధ రక్షణ కల్పించాలని కోరుతూ గతేడాది నవంబర్ 21న డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సునీత లేఖ రాశారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని విన్నవిస్తూ... రెండ్రోజుల కిందట హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు... ఈ లేఖను ఆమె జతపరిచారు. వివేకా హత్య కేసులో కీలకమైన శ్రీనివాసరెడ్డి హత్య నేపథ్యంలో... పరమేశ్వరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కాపలాదారు రంగయ్యల ప్రాణాలకూ ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. డీజీపీ, కడప ఎస్పీ కార్యాలయాల్లోనూ ఈ లేఖను స్వయంగా అందజేసినట్లు వెల్లడించారు.
నాన్నను చంపిన వారి నుంచి ముప్పు ఉంది: వివేకా కుమార్తె - వివేకా కుమార్తె సునీత రెడ్డి న్యూస్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుల నుంచి తమకూ ముప్పు పొంచి ఉందని... ఆయన కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు. తనను, తన భర్త నర్రెడ్డి రాజశేఖర్‌ను వారు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు.
![నాన్నను చంపిన వారి నుంచి ముప్పు ఉంది: వివేకా కుమార్తె viveka daughter about security](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5890472-409-5890472-1580336613650.jpg)
viveka daughter about security