ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gangadhar Reddy: గంగాధర్ రెడ్డిది సహజ మరణమేనా..? - గంగాధర్ రెడ్డి వార్తలు

Gangadhar Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

viveka case witness Gangadhar Reddy death
వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతి

By

Published : Jun 9, 2022, 11:25 AM IST

వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతి

Gangadhar Reddy: వివేకా హత్య కేసును తనపై వేసుకుంటే శంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి.. అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనంతపురం జిల్లా యాడికిలో అతను చనిపోయాడు. రాత్రి నిద్రపోయిన ఆయన మంచం మీద పడుకున్న వ్యక్తి పడుకున్నట్లుగానే విగతజీవిగా పడిఉన్నాడు. గంగాధర్‌రెడ్డి రాత్రి నిద్రలోనే మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్‌రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు.

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జైళ్లో ఉన్న.. దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడు. గంగాధర్‌రెడ్డిని గతంలో సీబీఐ అధికారులు ముడుసార్లు విచారించారు. ముడుసార్లు కడప నగరానికి పిలిపించుకుని ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్ 2న సీఆర్​పీసీ(CRPC) 161 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్య కేసును తన పైన వేసుకుంటే శంకర్ రెడ్డి పది కోట్లు ఇస్తానని చెప్పినట్లు సీబీఐకు గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. అయితే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయడానికి గంగాధర్ రెడ్డి నిరాకరించాడు. ఆ తర్వాత సీబీఐ అధికారుల పైనే అనంతపురం ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు.

తనకు ప్రాణహాని ఉందని రెండుసార్లు ఎస్పీని కలిశాడు. రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని కోరాడు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పులివెందులలో రౌడీషీటర్‌ జాబితాలో గంగాధర్‌రెడ్డి పేరు ఉంది. ఇతనిని కడప జిల్లా నుంచి బహిష్కరించగా.. అతను అనంతపురం జిల్లా యాడికి వచ్చి నివసిస్తున్నాడు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details