ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మంగారి ఆలయాన్ని దర్శించుకున్న పీఠాధిపతులు - బ్రహ్మంగారి మఠం తాజావార్తలు

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరించేందుకు ఇతర పీఠాధిపతుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పని నిమిత్తం.. మఠానికి చేరుకున్న వారంతా.. ఉదయం కాలజ్ఞాని ఆలయంతో పాటు, ఈశ్వరీదేవి మఠాన్ని దర్శించుకున్నారు.

veera brahmendraswamy temple
బ్రహ్మంగారి ఆలయాన్ని దర్శించుకున్న పీఠాధిపతులు

By

Published : Jun 13, 2021, 12:07 PM IST

కడప జిల్లాలోని కాలజ్ఞాన కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పుణ్యక్షేత్రం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరించేందుకు పీఠాధిపతులు అక్కడికి చేరుకున్నారు. వారంతా ఉదయాన్నే బ్రహ్మంగారి ఆలయం, పక్కనే ఉన్న ఈశ్వరీదేవి మఠాన్ని దర్శించుకున్నారు. ప్రొద్దుటూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాన్ని సందర్శించిన అనంతరం తిరిగి బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు.

మఠం పీఠాధిపతి విషయంలో కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ దివంగత పీఠాధిపతి వసంత వెంకటేశ్వరస్వామి భార్య మారుతీ మహాలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details