ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు గ్రామాల మధ్య సచివాలయం చిచ్చు... ఎమ్మెల్యే ఏం చేశారంటే..

ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులుకు కడప జిల్లా చిట్వేలి మండలం చిల్లావాండ్లపల్లెలో సచివాలయం నిర్మాణ విషయమై స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఎమ్మెల్యే వాహనశ్రేణిని అడ్డుకున్నారు.

By

Published : Nov 11, 2021, 10:19 PM IST

ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు
ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు

మ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులుకు చుక్కెదురు

కడప జిల్లా చిట్వేలి మండలం చిల్లావాండ్లపల్లెలో సచివాలయం నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులుకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే వాహనశ్రేణిని గ్రామస్థులు అడ్డుకున్నారు.

తిమ్మయ్యగారిపల్లి సచివాలయాన్ని అదే పంచాయతీలోని చిల్లావాండ్లపల్లెకు మార్చాలని ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కలెక్టర్‌ను కోరారు. ఎమ్మెల్యే సూచనతో చిల్లావాండ్లపల్లెలోనే సచివాలయం కట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నిర్ణయంతో తిమ్మయ్యగారిపల్లి, చిల్లావాండ్లపల్లె గ్రామ ప్రజల మధ్య వివాదం మొదలైంది. చివరకు ఒత్తిళ్లకు తలొగ్గి.. తిమ్మయ్యగారిపల్లిలోనే సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడానికి ఎమ్మెల్యే కోరుముట్ల బయలుదేరారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. చిల్లావాండ్లపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. పోలీసుల సహాయంతో అక్కడినుంచి బయటపడిన ఎమ్మెల్యే తిమ్మయ్యగారిపల్లిలో సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ABOUT THE AUTHOR

...view details