ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్యాయంగా సస్పెండ్ చేశారు... అతడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి'

అన్యాయంగా సస్పెండ్ చేసిన ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గ్రామస్థులు, కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా మంగంపేటలోని ఏపీఎండీసీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

villagers protest at mangampeta in kadapa
అన్యాయంగా సస్పెండ్ చేసిన ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాలి

By

Published : Dec 26, 2020, 8:44 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండీసీలో గునిపాటి రవిశంకర్ పని చేసేవాడు. అతడిని ఉన్నతాధికారులు విధుల నుంచి ఉన్నఫళంగా తప్పించారు. ఈ వ్యవహారంపై.. కార్మిక సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 'త్రివేణి కంపెనీకి చెందిన మట్టి తన పొలంలో వేయగా రవిశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాత్రం దానికే ఎటువంటి నోటీసులు, విచారణ లేకుండానే ఈ నెల 16న రవిశంకర్​ను సస్పెండ్ చేశారు' అని కార్మిక సంఘం నాయకులు తెలిపారు.

పునరావాస ప్రజలను ఏపీఎండీసీ యాజమాన్యం మోసం చేస్తుందని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మధ్యకాలంలో ఎలాంటి నోటీసులు లేకుండా ఎనిమిది మంది ఉద్యోగులను తొలగించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రవిశంకర్​ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ... అధికారులకు గ్రామస్థులు, కార్మిక సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details