ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో ప్రశాంతంగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు - కడప జిల్లాలో సచివాలయ పరీక్షల వార్తలు

కడప జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 22వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

village ward secretariat exams in kadapa district
కడప జిల్లాలో ప్రశాంతంగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

By

Published : Sep 20, 2020, 5:00 PM IST

కడప జిల్లాలో మొత్తం 96 పరీక్ష కేంద్రాల్లో 22 వేల మంది అభ్యర్థులు గ్రామ సచివాలయ పరీక్షలు రాశారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రంలోకి పంపించే ముందు అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details