'నగల కోసం మహిళా వీఆర్ఏ దారుణ హత్య' - kadapa
కడప జిల్లా అట్లూరులో ఎర్రపల్లె మహిళా వీఆర్ఏ హత్యకు గురైంది. పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లిన ఆమెను...చంపి బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

కడప జిల్లా యర్రబల్లె గ్రామ రెవిన్యూ వీఆర్ఏ...దారుణ హత్యకు గురయ్యారు. యర్రబల్లె సమీపంలో ఓబులమ్మ పత్తి సాగు చేస్తున్నారు. గురువారం పొలానికెళ్లిన ఆమె... తిరిగి ఇంటికి రాకపోవటంతో కుమారుడు రామ్మోహన్ పొలం వద్దకెళ్లి చూడగా తల్లి మృతి చెందినట్లు గుర్తించాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపి ఒంటి పై బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో ఆమెకు దుండగులకు మధ్య పెనుగులాట జరిగినట్లు గుర్తులున్నాయి. దుండగులు ప్రధాన దారి నుంచి కాకుండా వెనుక వైపు ముళ్లకంచెను తొలగించి వచ్చినట్లు తెలుస్తోంది. రామ్మోహన్ ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.