జగన్ చిన్నాన్నవై.ఎస్.వివేకానందరెడ్డిని వైకాపా వాళ్లే హత్య చేయించారని డీజీపీ చెప్తుతున్నారంటూ ఆ పార్టీఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి అసత్యాలు చెబుతుంటే ఏపీ పోలీసులను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఆంధ్రాపోలీసులు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. తెదేపా హత్యా రాజకీయాలు చేస్తోందన్న విజయసాయిరెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.హత్య కేసు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ అయితే అమలుచేసింది ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. జగన్ ప్రజాదరణను ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. డీజీపీని మార్చాలని డిమాండ్ చేశారు. భాజపా, తెదేపా మధ్య ఉన్న అనైతిక సంబంధం వల్లే డీజీపీని మార్చడంలేదని విమర్శించారు. వివేకానందరెడ్డి మరణంపై పూర్తి విచారణ చేపట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్తోకేంద్రానికి, రాష్ట్రానికి లేఖ రాశామని ఎంపీ తెలిపారు.