కడప జిల్లా రాజంపేటలోని ఓ రెస్టారెంట్‌పై జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో రెండు రోజులు నిల్వ ఉంచిన మాంసాహారం, ఇతర ఆహార పదార్థాలతో పాటు వాడిన నూనెను అధికారులు పరిశీలించారు. నిల్వ ఉంచిన కొన్ని ఆహార ఉన్న పదార్థాలను పరిశీలించి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అందించడంపై చర్యలు తీసుకుంటామని.. రెస్టారెంట్లపై దాడులు కొనసాగుతాయని విజిలెన్స్ సీఐ దస్తగిరి హెచ్చరించారు. రాజంపేట మండలం ఊటుకూరు పరిధిలో ఉన్న ఈ రెస్టారెంట్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీకి అధికారులకు సూచించారు.
'రెస్టారెంట్లు, హోటళ్లలో నిల్వ ఆహార పదార్థాలను ఉపయోగిస్తే కఠిన చర్యలు'
రెండు రోజుల నుంచి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్న కడప జిల్లా రాజంపేటలోని ఓ రెస్టారెంట్‌పై జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సీఐ దస్తగిరి హెచ్చరించారు.
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు