ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొలతల్లో తేడాలు.. కొరడా ఝుళిపించిన అధికారులు - విజిలెన్స్ అధికారులు తనిఖీలు తాజా వార్తలు

పలు దుకాణాలతోపాటుగా షాపింగ్​ మాల్స్​, రేషన్​ దుకాణాల్లో విజిలెన్స్ సీఐ లింగప్ప, ఏఓ సురేషన్​, తూనికలు కొలతల శాఖ అధికారి శంకర్ సంయుక్తంగా దాడులు జరిపారు. నిబంధనలు పాటించని పలు దుకాణాల యాజమానులుపై కేసులు నమోదు చేశారు.

vigilance officers checks
విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు

By

Published : May 7, 2020, 10:09 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు, మైలవరం మండలాల పరిధిలో.. విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాలతో పాటుగా.. షాపింగ్​ మాల్స్​, రేషన్​ దుకాణాల్లో విజిలెన్స్ సీఐ లింగప్ప, ఏఓ సురేషన్​, తూనికలు కొలతల శాఖ అధికారి శంకర్ సంయుక్తంగా దాడులు జరిపారు.

జమ్మలమడుగులోని ఓ షాపింగ్ మాల్​లో సరుకులపై తయారీ తేదీలు, సంబంధిత వివరాలు లేకపోవడంపై కేసు నమోదు చేశారు. మైలవరం మండలం, వేపరాల గ్రామంలోని రేషన్ దుకాణాల్లోనూ తనిఖీలు చేశారు. కొలతల్లో తేడాలు రావొద్దని అందరికీ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details