ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జమ్మలమడుగులో విజిలెన్స్ దాడులు.... 100 సబ్సిడీ విత్తనాల బస్తాలు సీజ్ - VIGELENCE ENQUIRES_100 SUBCIDY BAGS SEEZED IN KADAPA

అక్రమంగా సబ్సిడీ విత్తనాలను తరలిస్తుండగా కడప జిల్లా జమ్మలమడుగులో విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జమ్మలమడుగులో విజిలెన్స్ దాడులు.... 100 సబ్సిడీ విత్తనాల బస్తాలు సీజ్

By

Published : Oct 18, 2019, 12:03 AM IST

కడప జిల్లా జమ్మలమడుగులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి భారీ స్థాయిలో రాయితీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 2 వాహనాల్లో సుమారు వంద సంచుల రాయితీ శనగ విత్తనాలను జప్తు చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 50శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. కొంతమంది దళారులు రాయితీ విత్తనాలపై కన్ను వేశారు. రైతుల నుంచి శనగలు తీసుకొని వాటిని మళ్ళీ విత్తన కేంద్రానికి పంపిస్తున్నారు. దళారులు, విత్తన కేంద్ర యజమానులు రాయితీ విత్తనాలను అధిక ధరలకు నల్లబజారుకు సైతం పంపిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అనుమానంతో... దాడులు చేయగా... సుమారు వంద సంచుల రాయితీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఐచర్ వాహనం, మరో ఆటోను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

విజిలెన్స్ దాడులు.... 100 సబ్సిడీ విత్తనాల బస్తాలు స్వాధీనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details