ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన - vice president

ఇటీవలే ప్రారంభమైన కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైనును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వెంకయ్య

By

Published : Aug 23, 2019, 11:38 PM IST

Updated : Aug 24, 2019, 3:25 AM IST

నేడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచి ప్రత్యేక రైల్లో ప్రయాణించి కడప జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లికి వెంకయ్యనాయుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు వెంకటాచలంలో బయలుదేరి... సాయంత్రం 5 గంటలకు చెర్లోపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఇటీవలే పూర్తయిన 7 కిలోమీటర్ల రైల్వే సొరంగ మార్గాన్ని వెంకయ్యనాయుడు పరిశీలిస్తారు. అక్కడే పైలాన్ ఆవిష్కరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వెలుగొండ టన్నెల్​లో నిర్మించిన రైల్వే సొరంగ మార్గాన్ని ఉప రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసుశాఖ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అరగంటపాటు సొరంగ మార్గాన్ని పరిశీలించి ప్రత్యేక రైల్లో ఆయన తిరిగి వెంకటాచలం వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.

నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన
Last Updated : Aug 24, 2019, 3:25 AM IST

ABOUT THE AUTHOR

...view details