Venkatesh Dead body reached kadapa: కువైట్‌లో నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న.. కడప జిల్లా వాసి వెంకటేశ్ మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. కువైట్ లో ముగ్గురిని హత్య చేశారనే నేరంపై అతన్ని సెంట్రల్ జైలుకు తరలించగా.. జైలులోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇండియన్ ఎంబసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి.. మృతదేహాన్ని కువైట్ నుంచి విమానంలో చెన్నైకి చేర్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా.. లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడుకు తరలించారు. మృతదేహాన్ని చూసిన వెంకటేశ్ భార్య, అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వైకాపా, తెదేపా పార్టీల నేతలు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.
కువైట్‌లో కడప జిల్లా వాసి ఆత్మహత్య.. జిల్లాకు చేరుకున్న మృతదేహం - Venkatesh Dead body reached to kadapa from kuwait
Venkatesh Dead body reached kadapa: కువైట్‌లో నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న.. కడప జిల్లా వాసి వెంకటేశ్ మృతదేహం.. ఇవాళ ఆయన స్వగ్రామానికి చేరుకుంది. ముగ్గురిని హత్య చేశారనే నేరంపై.. వెంకటేశ్‌ను అక్కడి జైలుకు తరలించగా.. జైలులోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కువైట్‌లో కడప జిల్లా వాసి ఆత్మహత్య.. జిల్లాకు చేరుకున్న మృతదేహం
సంబంధిత కథనం:"ఆ హత్యలతో నా భర్తకు సంబంధం లేదు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి"