ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల వెనకజలాలతో మునిగిన వంతెన... నిలిచిన రాకపోకలు - news updates in kadapa district

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ గ్రామాల ప్రజలకు వంతెన కష్టాలు తీరడం లేదు. వర్షం వచ్చి సగిలేరు, సోమశిల వెనుక జలాలు పోటెత్తితే చాలు... కడప జిల్లాలోని వేములూరు వంతెన మునిగిపోతుంది. ఫలితంగా అట్లూరు మండలంలోని 36 గ్రామాల ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో రాకపోకలు చేయాల్సి వస్తోంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు ఇదే పరిస్థితి నెలకొంది.

vemulooru bridge Submerged  with somashila project backwater in kadapa district
సోమశిల వెనకజలాలతో మునిగిన వంతెన

By

Published : Sep 19, 2020, 7:21 AM IST

కడప జిల్లా అట్లూరు మండలంలోని వేములూరు వంతెన... సోమశిల జలాశయం వెనక జలాలతో మునిగిపోయింది. ఫలితంగా మన్యంవారిపల్లి, కమలకూరు, వేములూరు, మాడపూరు, కమలకూరు గ్రామపంచాయతీల పరిధిలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... వంతెన ఎత్తు పెంచుతామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నూతన వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details