ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలాలకు... ట్యూబ్​లపై వెళ్లాల్సిందే! - Veligallu Reservoir Rehabilitation Colony Farmers problems

పొలాలకు వెళ్లేదారి ప్రాజెక్టు వెనుక జలాలతో నిండిపోయింది. తొమ్మిది అడుగుల మేర నీరు నిలిచి ఉండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో తమ పొలాలకు వెళ్లే మార్గం లేక రైతన్నలు ట్యూబ్​ల సహాయంతో వెళ్లి తమ పనులు చేసుకుని తిరిగొస్తున్నారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న వారు నీటమునిగే అవకాశం ఉంది. ఇది కడప జిల్లా గాలివీడు మండలంలోని వెలిగల్లు జలాశయం పునరావాస కాలనీవాసులు పడుతున్న కష్టం.

Veligallu Reservoir Rehabilitation Colony Farmers problems
పొలాలకు ట్యూబ్​లపై వెళ్లాల్సిందే

By

Published : Dec 4, 2020, 1:45 PM IST

వర్షం రాలేదన్న బెంగ రైతులకు ఎక్కువే ఉంటుంది.. ఒకవేళ వర్షం వచ్చిందా అది కాస్త ఎక్కువ అయితే ఇబ్బందులు తప్పడం లేదు. కడప జిల్లాలో ఇటీవల వరుస తుపాన్లతో వరదలు పోటెత్తాయి. వాగులు వంకలు నదులు ప్రవహించి జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పొలాలకు వెళ్లేదారి ప్రాజెక్టు వెనుక జలాలతో నీటమునిగాయి. కడప జిల్లా గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు పునరావాస కాలనీ వాసులకు ఇలాంటి కష్టమే వచ్చింది.

వెలిగల్లు జలాశయం ఇటీవల నిండింది. కాలనీ సమీపానికి వెనుక జలాలు చేరడంతో గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లే దారి నీటమునిగింది. అరటి బొప్పాయి టమోటా వరి వేరుశనగ వంటి పంటలు సాగు చేసిన రైతులు పొలానికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో నీటిపై నడిచి వెళ్లే పరిస్థితి లేక రైతులు గాలి ట్యూబ్​లను ఏర్పాటు చేసుకుని వాటి ఆధారంగా ఉదయం సాయంత్రం రెండు వేళల ఈ ట్యూబ్​లపై వ్యవసాయ పనులు చేసుకుని ఇంటికి చేరుకుంటున్నారు. నీటిలో ఏమాత్రం ప్రమాదం జరిగిన నీట మునిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను వదులుకోలేక నీటి ప్రమాదం పొంచి ఉన్న ప్రయాణం తప్పడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పంట పొలాలు రహదారి ఏర్పాటు చేస్తే తమ కష్టం తీరుతుందని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details