అటవీ శాఖకు చెందిన భూమిని ఆక్రమిస్తున్నారనే అనుమానంతో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా రాజంపేట మండల అధికారులు. మందరం ప్రాంతంలో ఇసుక క్వారీ వద్ద అటవీ శాఖకు చెందిన భూమి కంచె తొలగించి చదును చేసే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులు 2 డోజర్లు, ఐదు టిప్పర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ డీఆర్ఓ రఘు శంకర్ తెలిపారు. దీనిపై విచారణ జరిపి అక్రమాలకు తావు లేకుండా చర్యలు పడతామన్నారు.
అటవీశాఖ భూమి చదును.. వాహనాలు సీజ్ - కడపలో వాహనాలు సీజ్ తాజా వార్తలు
కపడ జిల్లా రాజంపేటలో అటవీశాఖకు చెందిన భూమిని కంచె తొలిగించి చదును చేయడం అధికారులు వాహనాలను సీజ్ చేశారు. అటవీశాఖకు చెందిన భూమిని అక్రమిస్తున్నారనే అనుమానంతో వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు టీఆర్ఓ రఘుశంకర్ తెలిపారు.
అటవీశాఖ భూమిని చదును చేస్తున్న వాహనాలు సీజ్