అద్దెకు వాహనాలు తీసుకుని వాటిని దొంగతనంగా విక్రయిస్తున్న ఇద్దరు ఘరానా మోసగాళ్లను కడప ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కోటి 20 లక్షల రూపాయలు విలువ చేసే 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన రఘు, కౌశిక్ కుమార్ అద్దెకు వాహనాలు కావాలని చెప్పి ముందుగానే అద్దె చెల్లించి వాహనాలను తీసుకుంటారు. అనుమానం రాకుండా మూడు రోజుల తర్వాత వచ్చి మళ్లీ వాహనం కావాలని అడిగి మళ్లీ అద్దె చెల్లించి తీసుకెళ్తారు. తర్వాత కనిపించకుండా వెళ్లిపోతారు. ఇలా తీసుకున్న 14 వాహనాలను ఇతర ప్రాంతాలలో విక్రయించారు. వాహన యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నేడు అరెస్టు చేశామని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
అద్దెకు వాహనాలు తీసుకుంటారు...ఆపై ఉడాయిస్తారు! - కడపలో అక్రమంగా వాహన విక్రయాలు
ముందుగానే అద్దె చెల్లించి వాహనాలను తీసుకెళ్తారు. నమ్మకం కల్పిస్తారు. ఆ నమ్మకం నుంచి వాహన యజమానులు తేరుకునేలోపే వారికి చుక్కలు చూపిస్తారు ఈ ఘరానా మోసగాళ్లు. వాహన యజమాని పిర్యాదు మేరకు ఎట్టకేలకు కడప ఒకటో పట్టణ పోలీసులు వారిని అరెస్టు చేశారు.
డీఎస్పీ సూర్యనారాయణ