చెట్టును ఢీకొన్న వాహనం..ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - Vehicle collides with tree - One died, three injured
కడప జిల్లాలో మైదుకూరు బద్వేల్ రహదారిపై ఉన్న జెడ్. కొత్త పల్లి వద్ద టాటా ఏసీ వాహనం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో షేక్ దస్తగిరి అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.

చెట్టును ఢీకొన్న వాహనం- ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
కడప జిల్లాలో మైదుకూరు బద్వేల్ రహదారిపై ఉన్న జెడ్. కొత్తపల్లి వద్ద టాటా ఏసీ వాహనం చెట్టును ఢీకొంది. ప్రొద్దుటూరు నుంచి నెల్లూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన షేక్ దస్తగిరి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన కుమార్, హర్షద్, మునిలను మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: కడప ఆర్టీసీ డిపోలో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం